![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-6 లోని కొంతమంది ఇప్పుడు ట్రెండింగ్ లొ ఉంటున్నారు. ఇనయా సుల్తానా, ఫైమా, ఆరోహీ రావు ఇలా కొంతమంది రెగ్యులర్ గా వ్లాగ్స్ రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అయితే ఆరోహీ రావు తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్, ఆస్క్ మీ క్వశ్చనింగ్ అంటూ తన అభిమానులకి టచ్ లోనే ఉంటుంది.
ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది.
ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.
.webp)
ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది ఆరోహీ.. బిగ్ బాస్ సీజన్-6 లో మీకు అసలు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరని ఒకరు అడుగగా.. అందరు అని రిప్లై ఇచ్చింది. మీరు ఓకే అంటే పెళ్ళి చేసుకుందామని ఒకరు అడుగగా.. ఒకే నో అని రిప్లై ఇచ్చింది ఆరోహీ. మీరు శ్రీహాన్ లవ్ లో ఉన్నారంట నిజమేనా అని ఒకరు అడుగగా.. హా నువ్వొచ్చి మా పెళ్ళికి అక్షింతలు వేయు. ఏడ దొరికన సంతరా ఇది అని ఆరోహీ అంది. హలో రావు గారు.. మీరు సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నారంటే ఈ సమాజం నన్ను ఆక్సెప్ట్ చేస్తుందా అని ఒకరు అడుగగా.. తొక్కలో సమాజం ఆక్సెప్ట్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత నేను ఆక్సెప్ట్ చేయనని ఆరోహీ అంది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
![]() |
![]() |